– అమ్మవారిని దర్శించుకున్న వేలాదిమంది భక్తులు
– నేత్ర పర్వంగా కొనసాగిన జాతర
గజ్వేల్ , జులై 27
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో శ్రీ మహిషాసుర మర్ధిని ( పార్వతి దేవి )అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం మహిషాసుర మర్ధిని అమ్మవారిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బీవీ రావు పంతులు . ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయం మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం దాదాపు 500 సంవత్సరాల పూర్వం బెజగామలో వెలిసిన అమ్మవారు, కొలిచిన వారికి కొంగుబంగారంగా విరాజిల్లుతుంది, భారతదేశంలో మొదటి ఆలయం మహిషాసుర అమ్మవారి దేవాలయం కర్ణాటక రాష్ట్రం మైసూరులో, రెండవ దేవాలయం తెలంగాణ రాష్ట్రం లోని గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో కొలువైందని, గతంలో కాకతీయ మహారాజులు పాలించిన సమయంలో మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం నిర్మించారని,ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇంకా ఆలయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని, అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతయని ప్రజల విశ్వాసం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పురోహితులు వెంకటేశం శర్మ,అశోక్ శర్మ, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





