ప్రాంతీయం

హోం గార్డుల పాత్ర శాంతి భద్రతలు, ప్రజా భద్రతలలో ముఖ్యం

15 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*హోం గార్డుల పాత్ర శాంతి భద్రతలు, ప్రజా భద్రతలలో ముఖ్యం*

*హోంగార్డ్‌ల పనితీరు మరింత ప్రశంసనీయం:పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా*

హోంగార్డుల పనితీరు బాగుందని, విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం, బలిదానాలు మరువలేనివని, ప్రశంసనీయం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శనివారం 63వ హోంగార్డు రైసింగ్ డే వేడుకల సందర్బంగా హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్ లో హోంగార్డ్ సిబ్బంది పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ పరేడ్ కి కమాండర్ గా హోంగార్డ్ ఆర్ ఐ పెద్దన్న వ్యవహరించారు. పరేడ్ కి పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథులుగా హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శనని పరిశీలించారు.

అనంతరం పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ… హోంగార్డుల సేవలు ప్రశంసనీయం, పనితీరు ప్రశంసనీయమని శాంతిభద్రత లు, ట్రాఫిక్‌, క్రైమ్‌ నివారణ, కమ్యూని టీ పోలీసింగ్‌, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తు అత్యవసర పరిస్థితుల్లో హోమ్ గార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు.జిల్లా హోమ్ గార్డ్ సిబ్బంది ప్రతి డ్యూటీని బాధ్యతగా నిర్వహించే వారి క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్ శాఖకు గర్వకారణం అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు.

*కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ అధికారులతో కలిసి సీపీ పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు.*

ఈ పరేడ్ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఏసిపి నాగేంద్ర గౌడ్, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, ఆర్ ఐ లు దామోదర్ శ్రీనివాస్, శేఖర్, మల్లేశం, సంపత్, ఆర్ఎస్ఐలు హోంగార్డ్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *