మర్కుక్ మండల ప్రతినిధి,జులై 25
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని ఒకటో వార్డులో రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో ప్రజలకు రాక పోకలకు ఇబ్బందిగా మారింది. వృద్ధులు చిన్నారులు ఆ దారి వెంట నడవాలంటే ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే ఒకటో వార్డు లో సిసి రోడ్లు మరమ్మతు చేయాలని గ్రామస్తులు రోడ్ల పైన వరి నాటువేసి నిరసన వ్యక్తం చేశారు.
