Breaking News

102 Views

ముదిరాజుల సమస్యలపై మరింత కృషి చేస్తాం….
ప్రజాపక్షం రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతటా ముదిరాజు కులస్తులందరు మా ఐక్యత కోసం మరింత కృషి చేస్తామని బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దేశ్పాండే ఆంజనేయులు మాట్లాడారు. సోమవారం రోజున ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మత్స్యకారుల ఐక్యత కోసం అందరూ పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లలో కూడా బీసీ డీ నుండి ఏ కు మార్చాలని కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వము మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోలేదని అభిప్రాయపడ్డారు ముదిరాజ్ కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు వచ్చే ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో చూపెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి జిల్లా ముదిరాజ్ మహిళ నాయకురాలు బండి శ్రీమతి మండల సంఘము అధ్యక్షులు దేశ్ పాండి ఆంజనేయులు ,ప్రధాన కార్యదర్శి పిట్టల మోహన్ ,సంఘ సభ్యులు ఉత్తేర్ల గంగయ్య, బోయిని మహాదేవ్, జెల్ల సత్తయ్య, జజ్జరి బాలనర్సు, జజ్జరి లక్ష్మీ నర్సయ్య, బొమ్మనవేని నారాయణ,రేండ్ల సతీష్,మాచర్ల లక్ష్మీనర్సయ్య, పిట్ల సత్తయ్య, అల్లే రాజు, తదితరులు పాల్గొన్నారు.*

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్