గోరుముద్ద కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ ఆంజనేయులు గౌడ్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లిలో 59 మంది విద్యార్థులు 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉదయము, సాయంత్రము స్టడీ అవర్స్ నిర్వహిస్తున్న సందర్భంలో విద్యార్థులు ఆకలితో అలమటించకుండా, అన్ని రంగాలలో ముందుండాలనే సదుద్దేశంతో అల్పాహారాన్ని అందించడానికి తన వంతు సహాయంగా ఈ విద్యా సంవత్సరము పదివేల రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మురళీధర్ అందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి తో పాటుగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగంపేట కు కూడా ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
అంతేకాదు గత అనేక సంవత్సరాల నుండి విద్యార్థులకు ప్రాథమిక అవసరాలైన త్రాగునీటి కోసం, అల్పాహారం కోసం, స్వీపర్ల కు సైతం తన వంతు సహాయ సహకారాలను అందిస్తూ పాఠశాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న శ్రీ కొండ ఆంజనేయులు గారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు
శ్రీ పి మురళీధర్ గారు, ఎస్ఎంసి చైర్మన్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని
రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి శ్రీ ధనాలకోట రాధాకిషన్ కొండ ఆంజనేయులు గౌడ్ కు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల గొల్లపల్లి ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసినారు.
