మంచిర్యాల జిల్లా:
కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో వర్షాలకు బురదమయమైన రోడ్లను పరిశీలించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
ఎడ్ల బండి ఎక్కి గ్రామంలోని పలు వీధులను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి.
గ్రామంలో రోడ్లకు వెంటనే 12లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన వివేక్ వెంకటస్వామి…
రోడ్లకు నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు.
*కోటపల్లి మండలం అన్నారం గ్రామ శివారులో ప్రాణహిత ఉప్పొంగడంతో మునిగి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి*
పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న వివేక్ వెంకటస్వామి.
*వివేక్ సార్ కామెంట్స్*
చెన్నూర్ నియోజకవర్గంలో అన్నారం, శీర్ష, జనగామ, సుపాక, వెంచపల్లె గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంటలు నష్టం వాటిల్లింది
మంత్రి గారితో మాట్లాడడం జరిగింది.. కాలేశ్వరం కి సంబంధించిన అన్ని గేట్లు బ్యారేజ్ గేట్లు ఏక్కడ మూసి లేవు కానీ నష్టం వాటిల్లింది
కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పంట నష్టం పై సర్వే చేయాలని కోరడం జరిగింది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. మొన్న నే రైతులకు లక్ష రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం
త్వరలోనే రైతులకు రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనుంది
వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తా





