మంచిర్యాల జిల్లా
ఎలక్ట్రిసిటీ బిల్ పేరుమీద సైబర్ నేరగాళ్ల దోపిడీ
తేదీ 15-07-2025 న హైటెక్ సిటీ కాలనీ, మంచిర్యాల కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ అయిన వనం రఘు అనే వ్యక్తి కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ (TGNPDCL) నుండి ఒక లింక్ అతని మొబైల్ ఫోన్ కి మెసేజ్ రావడంతో తను అట్టి లింక్ కు ను ఓపెన్ చేయగా ఒక OTP వచ్చినది, వెంటనే సైబర్ నేరగాడు రఘు కు కాల్ చేసి తాము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కాల్ చేస్తున్నామని అతని ఎలక్ట్రిసిటీ బిల్ verify చేస్తున్నాము అట్టి OTP ను మెసేజ్ వచ్చిన నెంబర్ కు మెసేజ్ చేయమని చెప్పగా, వెంటనే రఘు అట్టి OTP ని సైబర్ నేరగాడి నెంబర్ కు మెసేజ్ చేసినాడు. ఆతరువాత రఘు యొక్క అకౌంట్ నుండి 5,23,000/- రూపాయలు సైబర్ నేరగాడి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఈ తరహా కొత్త నేరాలకు సైబర్ నేరగాళ్ళు తెరలేపినారు. రఘు తనకు జరిగిన సైబర్ మోసం నకు సంబంధించి మంచిర్యాల పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేయగా, ఇట్టి కొత్త తరహా సైబర్ మోసం పై కేసు నమోదు అయినది.
సైబర్ నేరగాళ్ళు రోజురోజుకి కొత్త తరహాలో జనాలను మోసం చేస్తూ టెక్నాలజీ ని ఉపయోగిస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారూ. కావున ప్రజలు అపరచిత వ్యక్తులు పంపే మెసేజ్ లకు రెస్పాన్స్ ఇవ్వడం గాని లేదా వారు పంపే లింక్ లను ఓపెన్ చేయడం గాని చేయరాదు. బ్యాంకు వారు గాని ఇతర డిపార్ట్మెంట్ వారు గాని ఎవ్వరు మెసేజ్ రూపంలో ప్రజలు ఎవ్వరిని సంప్రదించరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ప్రజల అమాయకత్వం ను ఆసరాగా చేసుకొని కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల అకౌంట్ ల నుండి డబ్బును కాజేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ విలువైన డబ్బును పోగొట్టుకోవద్దని మంచిర్యాల పోలీస్ వారు సూచించారు.
