(గన్నేరువరం జూలై 24)
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినన్ని మండల అధ్యక్షులు గంప వెంకన్న ఆధ్వర్యంలో కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు..
ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ..
ఉద్యమ ప్రస్థానంలోనే కాదు,తెలంగాణ ఉజ్వల ప్రగతి ప్రస్థానంలోనూ చెరగని సంతకం కల్వకుంట్ల తారకరామారావు అని అన్నారు.దిగ్గజ కంపెనీలన్నింటికీ తెలంగాణను డ్రీమ్ డెస్టినేషన్ గా,
ఉపాధి కల్పనకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ కు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన గొప్ప మహనీయుడు కేటిఆర్ అని కొనియాడారు..
సంక్షేమం సముద్రమంతా, అభివృద్ధి ఆకాశమంతా అన్నట్టుగా సాగిన పదేళ్ల పాలనకు పునాదిరాళ్లు వేసి,నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన నవతరం విజనరీ కేటిఆర్. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఏకైక ఆశయంగా ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో కదంతొక్కుతున్న కార్యదక్షుడు కేటిఆర్ కి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వప్న- సుధాకర్,మాజీ సర్పంచ్ పుల్లల లక్ష్మి-లక్ష్మణ్,మాజీ సర్పంచ్ నక్క మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మీసాల ప్రభాకర్, మాజీ డైరెక్టర్లు కొట్టే భూమయ్య,గొల్లపల్లి రవి, ఈదయ, బూర శ్రీనివాస్, ప్రశాంత్ యాదవ్,పాలెపు అజయ్, నగునూరి స్వామి,కుడికందుల అనిల్, మునిగంటి సాయి, బండి తిరుపతి,బత్తుల అంజి, నగునురి మల్లేశం, పరుశురాం, అనిల్, బుర్ర సత్యనారాయణ,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.