ఆధ్యాత్మికం

భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు

79 Views

భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు

● 25సంవత్సరాల నిర్వీరామ కృషి, పట్టుదలనే కారణం

● రామకోటి సంస్థను స్థాపించి లక్షల మంది భక్తులను
తయారుచేసిన ఘనత

● 400కోట్ల రామ నామాలను లిఖింపజేసి 1000కోట్లకు
శ్రీకారం చుట్టడం.

● చదువు రాని వారితో సైతం కోటి రామ నామాలు
లిఖింపజేసిన ఘనత

● కోటి రామనామాలు లిఖించిన భక్తులను సన్మానించిన
ఘనత

● భద్రాచల దేవస్థానమే మరో భక్త రామదాసుగా కీర్తించిన
ఘనత

● తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమెరికా లాంటి ప్రాంతాలలో
లిఖిస్తున్న రామకోటి.

● ఆర్ధిక పరిస్థితులు ఎన్ని ఎదురైనా అద్దె ఇంట్లో ఉన్న
రామనామమే శరణం అన్నాడు.

జూన్ 30 గజ్వేల్:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు కి ఆదివారం నాడు కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అధ్యక్షులు పోలోజు రాజకుమార్, ముఖ్య అతిథి సదానందం చేతుల మీదుగా సన్మానించి అందజేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి రోజు లక్షల మందికి భక్తులచే గత 25 సంవత్సరాల నుండి 400కోట్ల లిఖిత రామ నామాలను పూర్తి చేయించి 1000కోట్లకు శ్రీకారం చుట్టడం అయన ఆధ్యాత్మి, కృషి, పట్టుదలను గ్రహించి భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని రామకోటి రామరాజకు అందజేయడం విశేషం.

గత పాతిక ఏండ్ల నుండి యజ్ఞ, యాగాలు, సీతారాముల కళ్యాణలు, పలుమార్లు ఘనంగా నిర్వహించి, భక్తులకు భక్తి మార్గాన్ని చూపిస్తున్న రామకోటి రామరాజును భద్రాచలం దేవస్థానమే మరో భక్త రామదాసు కీర్తించి పలు సార్లు ఘనంగా సన్మానించారు. అన్ని దేవాలయాలు రామకోటి రామరాజు భక్తిని కీర్తించాయి.

భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంస్థకు ఇవ్వని గోటి తలంబ్రాల కార్యక్రమం రామకోటి సంస్థకు ఇవ్వడం తద్వారా లక్షల మంది భక్తులచే 150కిలోల గోటి తలంబ్రాలు ఓలిపించి తిరిగి సీతారాముల కల్యాణనికి అందించిన ఘనత రామకోటి సొంతం.
అలాగే కళ్యాణ అనంతరం ముత్యాల తలంబ్రాలు ఏ సంస్థకు ఇవ్వని 100కిలోలు రామకోటి రామరాజుకు అందజేషి ఘనంగా సన్మానించిన ఘనత రామకోటి రామరాజుకే సొంతం.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్