Breaking News

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం

107 Views

అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి

హనుమకొండ ప్రెస్ క్లబ్ లో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనే లక్ష్యంగా ఆదివారం ఏర్పాటుచేసిన జర్నలిస్టు గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి,

అనంతరం  మాట్లాడుతూ.ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్తంభం లాంటి వాళ్లు జర్నలిస్టులని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ప్రజల హక్కులను రక్షించడంలో జర్నలిస్టులు కీలక భూమిక పోషిస్తున్నారని,ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు అక్రమ కేసులు పెట్టినప్పటికీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన చరిత్ర నాటి జర్నలిస్టులందని గుర్తు చేశారు. తొమ్మిదేళ్లు గడుస్తున్న వరంగల్ కేంద్రంగా నాడు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ హామీలుగానే మిగిలిపోయాయని, ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులకు వార్తలు ప్రత్తిరించే జర్నలిస్టులకు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని చెప్పటం మరి దారుణం అన్నారు.

సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తక్షణమే జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి, అక్రిడేషన్ లో ఉన్న నిబంధనలను సడలించి, డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్న ప్రతిభగల జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో huమండలాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు ఇండ్లు ఇచ్చేంతవరకు మీరు చేసే పోరాటానికి మా సంఘీభావం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న డి జె ఎఫ్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి  అధ్యక్షులు పి, విశ్వనాథ్ రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్ పటేల్ రాష్ట్ర నాయకత్వం జిల్లాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *