ఎర్రపప్పు గింజలతో చంద్రశేఖర్ ఆజాద్ చిత్రాన్ని చిత్రించి
దేశభక్తిని చాటుకున్న రామకోటి రామరాజు
గజ్వేల్ , జులై 23
మీ నరాల్లో రక్తం మరగకపొతే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు నీళ్లు అన్న చంద్రశేఖర్ ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఎర్రపప్పు గింజలను ఉపయోగించి ఆజాద్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించి దేశభక్తిని చాటుకున్నాడుసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ అంటే చరిత్ర కాదు భారతీయ యువత త్యాగాలకు ప్రతిరూపం అన్నారు. స్వరాజ్యేచ్ఛతో 15 ఏళ్ళ వయసులోనే స్వతంత్ర సంగ్రామంలోకి అడుగిడి చంద్రశేఖర్ ఆజాద్గా మారి, 24 ఏళ్ళ వయసులోనే దేశం కోసం అమరుడైన ఆ మహనీయుని బాటలో నడవాలన్నారు
గత సారి ఆజాద్ చిత్రాలను అవాలతోనూ, సబ్బుబిళ్ల మీద చిత్రించి దేశభక్తిని చాటుకున్నాడు.
