స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున దక్షిణాఫ్రికా లో జరిగే కాన్ఫరెన్స్ లో సీఎండీ క్లబ్ అవార్డ్ కు ఎంపికయిన ఎక్సలెన్స్ రీజియన్ లయన్స్ క్లబ్ ఛైర్మెన్ గుడాల రాధాకృష్ణ, తన తోటి స్టార్ ఏజెంట్స్ తో కలిసి 76 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం పండుగను మిస్ కాకుండా దక్షిణాఫ్రికా కేప్ టౌన్ నగరంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.అక్కడి విచ్చేసిన వారి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడాల పద్మజ, పీవీ.ప్రసాద్, గమిని వెంకటేష్, దుర్గా ప్రసాద్, కేవీ.శ్రీనివాస్, జానకి రామ్ పాల్గొన్నారు




