కథనాలు

తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం !

151 Views

తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం !

– తోటి స్నేహితుడికి ఆర్థిక సహాయం అందజేసిన 1994-
1995 పూర్వ విద్యార్థులు

జులై 23 ,

సిద్దిపేట జిల్లా,ప్రజ్ఞాపూర్ లో కలసి చదువుకున్న తోటి మిత్రుడైన బింగి నర్సింలు వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనందున,నర్సింలుతో పాటు చదువుకున్న ఎస్ ఎస్ సి 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలసి నర్సింలు కూతురు పేరు మీద 33 వేల రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాసిట్ చేసి,మానవత్వం చాటుకున్నారు.అనంతరం నర్సింలు కుటుంబానికి బాండు అందించారు.వారు మాట్లాడుతూ 1994-1995 బ్యాచ్ పూర్వ విద్యార్థులందరం కలసి ఈ సహాయం చేయడం జరిగిందని అన్నారు.ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం వలన మనసుకి ఎంతో ఆనందం,సంతృప్తి,కల్గుతుందని,అందరు బాగుండాలి అందులో మనముండాలి అని ఈ సందర్బంగా వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పి.నరేష్ గౌడ్,డి.బిక్షపతి,కే.ఉప్పలయ్య,కే.చిన్న ఉప్పలయ్య ,ఎండి.జాహంగీర్,దువ్వల బిక్షపతి యాదవ్,యాదగిరి,బింగి రవి, పర్శరాములు,పి.రాజు,తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్