(తిమ్మాపూర్ జనవరి 11 )
విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2024 క్యాలెండర్ ను గురువారం ఆవిష్కరణ చేసారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ లో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశంలో భాగంగా వోపా మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.నిరుపేద విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం వోపా సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాలను వినియోగించుకోవాలని అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు.
నియోజకవర్గం వోపా గౌరవ అధ్యక్షులు, న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి,జిల్లా నాయకులు రావుల సత్యనారాయణ,గ్రామ సంఘం అధ్యక్షులు పాలోజు నాగభూషణం,ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు శ్రీనివాసచారి,కోశాధికారి వేములవాడ నర్సింహాచారి,సభ్యులు వేములవాడ కనకాచారి,పెందోట అనంతచారి,సుగుర్తి బ్రహ్మచారి,శ్రీరామోజు కమలాకర్,వేములవాడ శ్రీనివాస్, రాజు తదితరులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.