కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్.
దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ శనివారం రోజున ప్రేమ్ సాగర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కందుల కల్యాణ అశోక్ కొన్ని అనివార్య కారణాలవల్ల బిఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది ,మరల శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వారితోపాటు వెంబడి సురేందర్, బండ ప్రసాద్, చేరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






