ముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు.
