ప్రాంతీయం

తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశం

71 Views

తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశం ప్రాథమిక పాఠశాల రాంసాగర్ ఎస్సీ కాలనీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివలింగం అధ్యక్షతన తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతి, హాజరు, ప్రవర్తన,పాఠశాల అభివృద్ధి,మధ్యాహ్న భోజనం తదితర అంశాల గురించి చర్చించడం జరిగింది. విద్యార్థుల ప్రగతి విషయంలో పాఠశాల పనివేళల అనంతరం విద్యార్థుల యొక్క ఇంటి పని మరియు చదువు అంశాల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ మన్నె కవిత అంగన్వాడి టీచర్ అశ్విని, తల్లిదండ్రులు నాగరాజు, రమేష్, ప్రభాకర్, శ్రీనివాస్, స్వరూప, రేణుక, గీత,మమత, రమేష్, శ్యామల, రేణుక,సరోజ, నర్సవ్వ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found