సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ ఎల్కల్ గ్రామానికి చెందిన మహ్మద్ సజ్జు మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని. వారికి ప్రభుత్వం నుండి ఏదైనా సహాయం అందేలా చూస్తామని అన్నారు.
వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, కో ఆప్షన్ పర్వేజ్, ఎంపీటీసీ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ కుమార్ , టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ నాయకులు జాఫర్ తదితరులు ఉన్నారు