Breaking News

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 11 మంది ఎస్ఐల బదిలీలు

157 Views

(కరీంనగర్ జూలై 19)

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న యూనస్ అహ్మద్ అలీ ని హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న టి.వివేక్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు, కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పి. అభిలాష్ ని కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు, జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్. రాజేష్ ను వీఆర్ కరీంనగర్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న ఎన్. శ్రీనివాస్ ను కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ కు, హుజురాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న జి. సాంబయ్య ను సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు, కరీంనగర్ వీఆర్ లో ఉన్న ఎస్. హనుమంతరావును పోలీస్ కంట్రోల్ రూమ్ కు బదిలీ చేశారు.

No Slide Found In Slider.

Poll not found