మంచిర్యాల జిల్లా:
కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతు వాగు వంతెనను పరిశీలించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ వరద రావడంతో కొట్టుకు పోయిన లోతు వాగు వంతెన.
ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి సమీక్షించి వెంటనే వంతెన మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
వివేక్ సార్ కామెంట్స్
నక్కలపల్లి వాగు వంతెనను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.మండలంలోని నక్కలపల్లి, రాజారాం, ఎదుల బంధం గ్రామాలకు అటవీ శాఖ అనుమతులు లేక రోడ్లు, వంతెన పనులు నిలిచిపోయాయి.
ఆర్ అండ్ బీ అధికారులను అటవీశాఖ అధికారులతో మాట్లాడి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన వివేక్ వెంకటస్వామి.
కావాలనే కొందరు బీజెపీ నాయకులు తన పై బురద జల్లుతున్నాను.
బీజెపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే డిల్లి వెళ్లి కేంద్రం నుండి అటవీ అనుమతులు తీసుకురావాలి.
13 లక్షల రూపాయల అంచనా నిధులతో మంగళవారం వరకు వంతెన మరమ్మత్తు పనులను ప్రారంభిస్తాం.
చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే డిల్లి వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది…
నేను ఏ రోజూ కూడా మంత్రి పదవి కావాలని కోరలేదు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాను.





