24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జులై 18)
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాండురంగ ఆశ్రమంలో గురువారం అత్యంత వైభవోపేతంగా 93 వ ఆశాడి ఉత్సవాలు ముగిశాయి, ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వరుస క్రమంలో స్వామివారిని దర్శించుకున్నారు. నూతనంగా నిర్మించిన సాద మండపంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు, హరే రామ నామ సంకీర్ణం తో ఆశ్రమం ప్రాంగణం మారుమోగుతోంది, రుక్మిణి పాండురంగ స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రజల విశ్వాసం అని ఆశ్రమ పురోహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదునూరి వెంకటరమణ శర్మ, అప్పాల సత్యనారాయణ శర్మ, అప్పల రసరాజ శర్మ, విఠల శర్మ, శశిధర్ శర్మ,అప్పాల మాధవ శర్మ, రాధాపతి శర్మ, శివకుమార్ శర్మ, భవానంద శర్మ,శ్రీదర్ శర్మ, ఆశ్రమ సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.





