ఏకకాలంలో రుణమాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం!
– మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్
మర్కుక్ ప్రతినిధి,జులై 18
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించి చూపించారని మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. మర్కుక్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో పంట రుణమాఫీ చేస్తున్న తరుణంలో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తొలిరోజే 11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేయడం సంతోషకరంగా ఉందని అన్నారు.దశబ్ద కాలం నుండి రైతు రుణమాఫీ జరగక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో మర్కుక్ మండలంలో 1543 మంది రైతులకు మొదటి దశలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. రానున్న 15 రోజుల్లో మిగతా రైతుల రెండు లక్షల రుణమాఫీ కూడా ఏకకాలంలో చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం సంతోషకరంగా ఉందని అన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అద్యక్షుడు వెంకటేష్ గౌడ్,నాయకులు క్రాంతి కుమార్, నర్సింలు,జితేందర్ రెడ్డి,నాగేందర్ రెడ్డి, సుధాకర్ గౌడ్,తిరుపతి రెడ్డి, నరాం రెడ్డి,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





