ప్రాంతీయం

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

100 Views

తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

టీజేయు జిల్లా అధ్యక్షులు ఎం డి.షానూర్ బాబా 

జులై 17

యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కోసం ‘తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్. షానూర్ బాబా ఆధ్వర్యంలో డాక్టర్.సుమంత్ కంటి హాస్పిటల్ సహకారంతో ఈ నెల 21న ఆదివారం రోజున నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షానూర్ మాట్లాడుతూ జిల్లా లొ పనిచేస్తున్న జర్నలిస్టులకు ఏదైనా కంటి సమస్యలు ఉన్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని కోరారు. నిర్వహించిన అనంతరం డాక్టర్ సూచన మేరకు కంటి అద్దాలు,మందులు ఉచితంగా ఇవ్వబడునని,

సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1 గంటల వరకు, విజయ్ భార్గవ్ హాస్పటల్ పక్కన, మీనా నగర్, భువనగిరిలొ ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు .ఈ కార్యక్రమంలో టీజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపరాజు వెంకన్న, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ రషీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టి కొప్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్