ప్రాంతీయం

విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు

179 Views

విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు

విద్యార్థులకు అండగా ఎన్ఎస్యుఐ పోరాడుతుంది కొప్పు రవి (ఎన్ ఎస్ యు ఐ) జిల్లా కార్యదర్శి,

యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ అద్యక్షుడు కడపల కృష్ణా రెడ్డి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 9

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామం దగ్గర సైనిక్ స్కూల్ లో ఒక విద్యార్థి విషయంలో గొడవ జరిగిన విషయం తెలుసుకోవడం జరిగింది విద్యార్థినిని ప్రిన్సిపల్ బలవంతంగా వెళ్లగొట్టిన విషయం తెలుసుకున్న ( ఎన్ ఎస్ యు ఐ ) సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొప్పురవి ఈరోజు ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి అక్కడ సమస్యలు తెలుసుకొని యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని విద్యార్థి కట్టిన ఫీజు మొత్తం రిఫండ్ చేస్తామని యజమాన్యం ఒప్పుకున్నదని వారన్నారు అలాగే భోజనం, సీసీ కెమెరాలు ,హాస్టల్ టాయిలెట్స్ , వంటి మౌలిక సదుపాయాలు మరియు సెక్యూరిటీ భద్రత గురించి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ములుగు మండల (ఎన్ ఎస్ యు ఐ )అధ్యక్షుడు వేణు గౌడ్, వినయ్ జనార్ధన్ హరి బన్నీ ఇతర నాయకులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found