ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రుద్రంగి లో సంబరాలు
డిసెంబర్07 సిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా అలాగే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా రుద్రంగి సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో టపకాయలు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి సంబరాలు నిర్వహించినట్టు తెలిపారు.ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి రాష్ట్రన్నీ అభివృద్ధి పథంలో నడపాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఆది శ్రీనివాస్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి నియోజకవర్గనికి సేవలందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో.గ్రామ మహిళలు పాల్గొన్నారు





