ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం — శివారెడ్డి
రైతు రుణమాఫీ హర్షణీయం
డిబేట్ జిల్లా గజ్వేల్ జూలై 11
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివారెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివారెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతు రుణమాఫీ ఆమోదం తెలపడం హర్షణీయం అని గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయలేదని కేవలం మాటలకే పరిమితం అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా నెరవేరుస్తూ ప్రజాదరణ పొందుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు అలాగే ఇటీవల బి ఆర్ ఎస్ నాయకులు గజ్వేల్ కు వచ్చిన నిధులు కాంగ్రెస్ రాకుండా చేస్తుందని అనడం హాస్యాస్పదం అని అన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో లో గజ్వేల్ నియోజక వర్గం అభివృద్ధి లో ముందుకు సాగుతుందని అన్నారు,కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం దిశగా అడుగులు వేస్తుందని అన్నారు





