ప్రాంతీయం

ఇంటిని ముట్టడిస్తాం

61 Views

ఆక్రమించిన భూములను ప్రభుత్వానికి, ప్రజలకు అప్పగించకుంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడిస్తాం

సిపిఐఎం

సిద్దిపేట జిల్లా జూలై 14  

సిద్దిపేట జిల్లా చేర్యాల్ జీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన భూధాన్, సీలింగ్, వెంచర్ భూములను ప్రభుత్వానికి, ప్రజలకు, మున్సిపాలిటీకి వెంటనే అప్పగించాలని లేనిపక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేసి కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని, భూ కబ్జాలు చేస్తూ అధికారులను లోబర్చుకొని రికార్డులు మార్చుకొని భూములను అనుభవవిస్తున్న కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడి వాస్తవాలను తెలుసుకోకుండా సిపిఎం పార్టీని, సిపిఎం నాయకులను విమర్శించే నైతికత తమ స్వార్థం కోసం రకరకాల పార్టీలు మారే సనాది భాస్కర్, చెరుకు రమణారెడ్డి లకు లేదని సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, తాజా మాజీ సర్పంచ్ తాడూరి రవీందర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దాసరి ప్రశాంత్, మత్స్య కార్మిక సంఘం జిల్లా మాజీ డైరెక్టర్ తేలు ఇస్తారి లు హెచ్చరించడం జరిగింది. ఆదివారం రోజున చేర్యాల సిపిఎం పార్టీ కార్యాలయంలో చేర్యాల ప్రాంత ముఖ్య కార్యకర్తల సమావేశం బండ కింది అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొంగరి వెంకట మావో, తాడూరి రవీందర్, దాసరి ప్రశాంత్, తేలు ఇస్తారి లు మాట్లాడుతూ చేర్యాల ప్రాంతంలో సిపిఎం పార్టీ అలుపెరుగని ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నదని ఈ పోరాటాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రభుత్వ సీలింగ్ భూదాన్ భూములను మరియు వెంచర్ భూములను ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి రెవెన్యూ సబ్ రిజిస్టర్ అధికారులను లోవర్చుకొని తన ధన బలము అధికార పొలంతో సుమారు 30 ఎకరాల 21 భూమిని ప్రభుత్వానికి ప్రజలకు చెందాల్సిన ఈ భూములను ఆక్రమించి అనుభవిస్తున్నాడని ఈ భూములను వెంటనే ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని ఇటీవల సిపిఎం పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, తెలుగుదేశం, టి ఎమ్ ఆర్ పి ఎస్ సంయుక్తంగా చేస్తున్న పోరాటాలను ప్రజలు ప్రశంసిస్తుంటే కొంతమంది కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డ వ్యక్తులు, తమ ఉనికి కోసం పార్టీలను మార్చే వ్యక్తులు సిపిఎం పార్టీ పోరాటాలను సిపిఎం నాయకులను విమర్శించడం సూర్యుని పైన ఉమ్మి వేయడం లాంటిదని ఈ విమర్శలు మానుకోవాలని ఇప్పటికైనా ఈ భూముల రికార్డులను తెలుసుకొని మాట్లాడాలని విమర్శించడమే పనిగట్టుకుంటే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల పట్టణంలో 984, 985, 987 సర్వే నంబర్లలో వెంచర్ చేసి వెంచర్ నిబంధనలను గాలికి వదిలేసి వెంచర్లో నివసిస్తున్న ప్రజల అవసరార్థం బడి ఆట స్థలము పబ్లిక్ పార్క్ లాంటి వాటికి మున్సిపాలిటీకి వెంచరు చేసిన భూమిలో పది శాతం భూమిని అప్పగించాల్సిన దానిని రెండు ఎకరాల భూమిని తన వద్దే ఉంచుకొని ఇతరులకు అమ్మాలని చూస్తున్నాడని ఈ భూమిని వెంటనే మున్సిపాలిటీకి అప్పగించాలని, చేర్యాల శివారు వావిళ్ళ వంపులో 1030 సర్వే నంబర్లో ఏడెకరాల ఒక గుంట భూదాన్ భూమిని రెవెన్యూ అధికారులను, సబ్ రిజిస్టార్ ను లోవర్చుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ భూములను అనుభవిస్తున్నాడని, వందలాది ఎకరాల భూములు గల కొమ్మూరి ప్రతాపరెడ్డి కి ప్రభుత్వ భూదాన్ భూమిని పట్టా చేసుకొని ఎలా అనుభవిస్తున్నాడో సిపిఎం ను విమర్శించే వారు ముందు తెలుసుకోవాలని ఇప్పటికైనా కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించి అనుభవిస్తున్న భూములను ప్రభుత్వానికి ప్రజలకు అప్పగించాలని లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వానికి ఆక్రమించిన భూములను అప్పజెప్పకుండా వ్యవహరిస్తే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని, ఇండ్లు ఇండ్ల స్థలాలు లేని పేదల చేత ఈ భూములలో జెండాలు పాతించి గుడిసెలు వేయిస్తామని అంచలంచలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ సమావేశంలో పోలోజు శ్రీహరి, ముస్త్యాల ప్రభాకర్, బోయిన మల్లేశం, ఆముదాల రంజిత్ రెడ్డి, ఎర్ర బోసు అశోక్, దాసరి చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్