ప్రాంతీయం

మొదటి మహాసభను విజయవంతం చేయండి

58 Views

డీఎస్పీ జిల్లా మొదటి మహాసభను విజయవంతం చేయండి.

సిద్దిపేట్ జిల్లా జులై 14

ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు 28వ తేదీన జరిగే ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా మొదటి (ప్లీనరీ) మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు కోరారు.ఆదివారం మహాసభ కరపత్రాన్ని మిరుదొడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద ఉన్న 93% బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల తరఫున ధర్మ సమాజ్ పార్టీ రాజకీయ యుద్ధం చేస్తుందన్నారు.తెలంగాణ గడ్డమీద మూడు అగ్రకుల పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి పార్టీలు ఆయా పార్టీలో ఉన్న బీసీ ఎస్టీలను జెడ్పిటిసి,ఎంపిటిసి,సర్పంచ్ స్థానాలకే పరిమితం చేస్తూ ఎమ్మెల్యే,ఎంపీ మెజార్టీ స్థానాలలో అగ్రకులాలకు పూర్తి చేసి విజయం సాధిస్తూ ముఖ్యమంత్రి రాష్ట్ర పాలన మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారని అన్నారు. పేదలందరినీ ఏకం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మణ్,మండల అధ్యక్షులు దీపక్ రాజ్,మండల నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్