చికిత్స అనంతరం మంచిర్యాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల చేరుకున్న ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మరియు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చికిత్స అనంతరం ప్రత్యేక ఎలిఫర్డ్ లో హైదరాబాదు నుండి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. చికిత్స అనంతరం ప్రేమ్ సాగర్ రావు రాకతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆయన నివాసం వరకు ఘన స్వాగతం పలికారు.





