ప్రాంతీయం

ఎస్ జి టి ల పై చిన్నచూపా!

122 Views

*సెకండరీ గ్రేడ్ టీచర్లు( ఎస్. జి. టి.) నిర్లక్ష్యం బారిన పడ్డారా..!*

*నాన్ జాయినింగ్, లెఫ్ట్ ఓవర్ పోస్టుల విషయంలో అన్యాయానికి గురవుతున్నారా..!*

విద్యాశాఖ కానీ, ఇటు సంఘాలు కానీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధ వారిలో ఉందా…! మొన్నటి బదిలీలు, పదోన్నతుల్ని చూస్తే ఇవన్నీ నిజమంటున్నారు బాధిత టీచర్లు. మిగిలిపోయిన పోస్టుల విషయంలో ప్రమోషన్లను పట్టించుకోకపోవడం ప్రైమరీ స్కూళ్లల్లో పనిచేసేవారిని తీవ్ర నిరాశకు గురిచేసింది.

*నోటిఫైడ్ అయినా…*

ప్రమోషన్లకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న పోస్టులు ఇంచుమించు 6,000. అందులో మొన్నటి పదోన్నతుల్లో ఒక్కొక్కరు రెండు లేదా మూడు చోట్ల అప్లై చేసుకుని ఎక్కడో ఒకచోటకు వెళ్లిపోయారు. అలా 4,100 మందికి పైగా ప్రమోషన్లు పొందితే.. దాదాపు 1,800కు పైగా పోస్టులు మిగిలిపోయాయి. నోటిఫైడ్ అయిన ఈ పోస్టుల్ని తదనంతరమే భర్తీ చేయాల్సి ఉన్నా అటు విద్యాశాఖ గానీ, ఇటు సంఘాలు కానీ పట్టించుకోలేదని. ఎస్. జి. టి. లు మండిపడుతున్నారు.

*తప్పిదం, నిర్లక్ష్యం…*

వాస్తవానికి ప్రమోషన్లు 2015లో ఇస్తే మళ్లీ దశాబ్దకాలానికి కనపడ్డాయి. ఇప్పుడైనా తమకు ఛాన్స్ దక్కుతుందని చాలామంది ఎదురుచూశారు. కానీ ఇప్పుడూ వారికి రిక్తహస్తాలే ఎదురై నోటిఫైడ్ అయిన పోస్టుల్లోనూ ప్రమోషన్లు దక్కలేదు. లాంగ్వేజ్ పండిట్, పీఈటీ పోస్టులు అప్ గ్రేడ్ కాగా.. వారితోపాటే 2017- టి. ఆర్. టి. లో రిక్రూటైన లాంగ్వేజ్ పండిట్( ఎల్ పి) -2, పి. ఈ. టి. ల పోస్టుల్ని కొంతకాలం క్రితం అప్ గ్రేడ్ చేశారు. SGT తత్సమాన పోస్టుగా భావించే ఎల్.పి-2, పీఈటీల్ని కొద్దికాల సర్వీసు(నాలుగైదేళ్ల)కే అప్ గ్రేడ్ చేయడంతో.. 22 ఏళ్ల సర్వీసున్న ఎస్. జి. టి. లు వాళ్లకు జూనియర్లుగా మారాల్సి వచ్చింది.

*ఓట్లుంటేనే విలువనా…*

ఈ విషయాన్ని ఒకట్రెండు సంఘాలు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాయి. కానీ మిగతా సంఘాలు పెద్దగా పట్టించుకోలేదని ఎస్. జి. టి. లు ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి ఇక్కడో తిరకాసు ఉందంటున్నారు. మండలికి జరిగే ఎన్నికల్లో తమకు ఓటుహక్కు లేదని. ఎల్. పి. -2లు పి. ఈ. టి. లు హైస్కూళ్లల్లో పనిచేస్తారు కాబట్టి వారికి ఓటుహక్కు ఉంటుందంటున్నారు. ఈ కారణంతోనే ఎల్. పి -2లు, పి. ఈ. టి. ల అప్ గ్రేడేషన్ ను సంఘాలు పట్టుబట్టి మరీ చేయించాయని. కానీ ఓటుహక్కు లేని ఎస్. జి. టి. లను ఇప్పటికీ పట్టించుకోవట్లేదని మంచిర్యాల జిల్లా. ఎస్. జి. టి నాయకులు వేల్పుల కిరణ్ కుమార్ విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యాశాఖ డైరెక్టర్ కలిసి విన్నవించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్