ప్రాంతీయం

నీరు లేక బోసిపోయిన కలువ కాంగ్రెస్ వచ్చింది కరువు ను తెచ్చింది

106 Views

నీరు లేక బోసిపోయిన కలువ…

వెలవెల బోతున్న చెరువులు కుంటలు.

కాంగ్రెస్ వచ్చింది కరువు ను తెచ్చింది..

నీళ్లు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి

ఉదర మాటలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 11

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కరువును తెచ్చిందని జగదేవపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య అన్నారు గురువారం మండల కేంద్రంలో శ్రీ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ వద్ద విలేఖల సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి కరువును తెచ్చిందని సూచించారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని ఉదర మాటలతో అధికారులకు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాలువల ద్వారా మీరు అందించకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మండలంలోని 29 గ్రామాల్లో మొత్తం 42 చెరువు చెరువులు కుంటలు ఉన్నాయని తెలిపారు

తిగుల్,రాయవరం గ్రామాల మధ్య నిర్మించిన రాచకట్ట జలాశయం ధర్మారం గ్రామంలో బోడబండ ప్రాజెక్టు ఉందని గత ఏడాది వర్షాలు పుష్కలంగా పడడంతో చెరువులు కుంటలు ప్రాజెక్టులు జలమాయం సంతరించుకున్నాయని తెలిపారు.ఆరుద్ర కార్తిలోనే నాట్లు వేసి పనులు ముమ్మరంగా కొనసాగాయని తెలిపారు. శ్రీ కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీరు

రావడంతో అన్నదాతలు ఆ కాలువ లో మోటర్లు పెట్టి పంటలు పండించుకునే వారని తెలిపారు కానీ ఈరోజు కాంగ్రెస్ హయాంలో వర్షాలు లేక రిజర్వాయర్లో నీటి ఉన్నప్పటికీ కల్వదారా నీటి రాకపోవడంతో రైతన్నలు కన్నీరు అవుతున్నారని పడ్డారు.

వంద రోజుల్లో ఆరు హామీలు నెరవేర్చమని హామీ ఇచ్చి మరిచారని మండిపడ్డారు. అదే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు విపరీతమైన వర్షాలు పడి చెరువులు కుంటలు జలమయాయని పేర్కొన్నారు. ఉద్దర మాటలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్

ఉద్దెర హామీలిచ్చిందని, రైతు బంధు, రైతు రుణమాఫీ, వరి పంటకు బోనస్‌ ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్య లక్ష్మి కింద రూ. 10 లక్షల పథకం అమలు చేస్తే, రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా రూ. 10 లక్షలు ఇచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500 ఇస్తామన్న మాట ఏమైందని, వృద్ధులకు డిసెంబరు నెల నుంచి రూ.4 వేల పెన్షన్‌ ఇస్తామని, నాలుగు నెలలైనా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఎండాకాలం కరువులోనూ పంట పండుతుందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు, మాజీ సీఎం కేసీఆర్‌ కృషి వల్లేనని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు నెలలతరబడి జీతాలు అందడంలేదని, వారికి వెంటనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వ హణ, ఇతర ముఖ్యమైన విధులు నిర్వహిస్తున్న 60వేల మందికి పైగా ఉద్యోగ, కార్మికులకు వేతనాలు రాకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు.ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోడ్ల మిధికి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సడల కరుణాకర్,మహేష్,శేఖర్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్