సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 15 (TS24/7 తెలుగు న్యూస్):సీఎం కెసిఆర్ గజ్వెల్ లో హైట్రిక్ ఖాయం అని, సీఎం లక్ష మెజార్టీ తో గెలుపు ఖాయం అని రాష్ట్ర యఫ్ డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అని అన్నారు. జగదేవపూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన 60 మంది రజకులు రాష్ట్ర యఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,బీ ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,బీ ఆర్ యస్ మండల ప్రధాన కార్యదర్శి యశ్వంత్ రెడ్డి, వట్టిపల్లి బీ ఆర్ యస్ గ్రామ అధ్యక్షులు భూమ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీ ఆర్ యస్ తీర్థం పుచ్చుకున్నారు. బీ ఆర్ యస్ లో చేరిన వారికీ గులాబీ కండువా కప్పిపార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు కూడా అందుతున్న సంక్షేమ పథకాలు చూసి బీ ఆర్ యస్ లో చేరుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా అధ్యక్షులు భూమా దేవధానం, బీ ఆర్ యస్ మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మండల యస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి కొలిప్యాక రాములు,రజకులు గణేష్, నర్సిములు, కర్ణాకర్, చంద్రయ్య, బాలమణి అండాలు, యాదవ్వ, యం. సూరి, శివారెడ్డి, బీ ఆర్ యస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.