ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతున్నారు
సిద్దిపేట జిల్లా జూలై 9
మర్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ పల్లి గ్రామ చౌరస్తాలో స్వర్గం శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ, వయసు 35 సంవత్సరములు తన యొక్క కిరాణా షాపులో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడుపుతున్నారని నమ్మదగిన సమాచారం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు సిబ్బంది మర్కుక్ పోలీసులు వెళ్లి షాపుపై రైడ్ చేసి బీర్లు విస్కీ బాటిల్ లు, లిక్కర్ బాటిల్ అందాజ మొత్తం 128 లీటర్ల మధ్యన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది
మర్కుక్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో అక్రమ వ్యాపారాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది
జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, బెల్ట్ షాపులు నడిపిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలుజరుగుతుందని తెలిపారు.
గ్రామాలలో,పట్టణాలలో ఇసుక, అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన బెల్ట్ షాపులు నడిపిన, గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్నా రవాణా చేసిన మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
