ప్రాంతీయం

మంచిర్యాలలో బిజెపి అసెంబ్లీ స్థాయి సమావేశం

78 Views

ఎమ్మెల్యేకు మంత్రి పదవి పై ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు లేదు? – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.

ఈరోజు మంచిర్యాల పట్టణంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మంచిర్యాల అసెంబ్లీ స్థాయి సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని అన్నారు. రైతు రుణ మాఫీ రైతు భరోసా పేరుతో రైతులను, ఉద్యోగాల నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగ యువతను, ప్రతి మహిళకు 2500 రూపాయలు అని మహిళను, పెన్షన్ పెంపు పేరుతో వృద్దులకు వికలాంగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు. అదే విధంగా మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నియోజవర్గంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం హైదరాబాద్ మరియు ఢిల్లీ చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్నారని అన్నారు. మంచిర్యాల అసెంబ్లీ లో ప్రతి గ్రామంలో మరియు మున్సిపల్ వార్డుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించకుండా మంత్రి పదవి కోసం కోసం పైరవీలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కు మంత్రి పదవి పై ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు లేదు ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ అందించ లేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వర్షకాలంలో పారిశుధ్య నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరియు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ తరపున పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోనే శ్యామ్ సుందర్ రావు, రజనీష్ జైన్, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పురుషోత్తం జాజు, మున్నరాజా సిసోడియా, తోట మల్లికార్జున్, ముదాం మల్లేష్, మోటపలుకుల తిరుపతి, జోగుల శ్రీదేవి, ఎనగందుల కృష్ణ మూర్తి, గుండా ప్రభాకర్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, సత్రం రమేష్, వీరమల్ల హారి గోపాల్, గోపతి రాజన్న, వివిధ మండలాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్