సింగరేణి వ్యాప్తంగా కార్మిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాం ఏఐఎఫ్టీయూ.
సింగరేణి బొగ్గు పనుల రక్షణ కోసం కార్మిక వాడలను చైతన్య పరుస్తూ అరుణోదయ కళాకారుల ద్వారా కార్మిక వాడలలో బస్తి సమావేశాలను నిర్వహిస్తామని ఏఐఎఫ్టియు గౌరవాధ్యక్షురాలు విమలక్క ఆటపాటల ద్వారా సింగరేణికి ఎదురు కాబోయే నష్టాలను వివరిస్తూ గతంలో ఎలాంటి ఉద్యమాల ద్వారా కార్మిక హక్కులను సాధించుకున్నామో కార్మిక కుటుంబాలకు వివరిస్తూ సింగరేణి వ్యాప్తంగా సదస్సులను కూడా నిర్వహించే ఆలోచనలు ఏఐఎఎఫ్టియు చేస్తున్నట్టు ఆ సంఘం కోల్బేట్ ప్రతినిధులు జి రాములు ఎం రాయమల్లు ఏం పోచమ్మలు టి రత్నకుమార్ ఏం రామస్వామి బి యాకయ్య కృష్ణ స్వామి కే మల్లేశులు ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ కంపెనీలకు బొగ్గు గనులను దారాదత్తమ్ కుట్రలను అడ్డుకోవడంలో భాగంగా సింగరేణి ప్రాంత కార్మిక కుటుంబాలను కదిలించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు అన్ని విప్లవ సంఘాలు ఒక్కటే వేదికగా ఈ కార్యక్రమాల నిర్వహణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.





