*రామగుండం పోలీస్ కమిషనరేట్*
*ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోని విచారణ*
*33 లక్షల 10,వేల నగదు స్వాధీనం.*
సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఎస్ఐ లు లు శ్రావణ్ కుమార్ , నరేష్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక వాహనం MH -01 –AV-1377 వాహనం ఆపి అందులో ఉన్న ముగ్గురు యువకులను ప్రశ్నించగా సరైన సమాదానం చెప్పకుండా ఉండడంతో అనుమానం వచ్చి వాహనం తనిఖి చేయగా వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగులో చూడగా అధిక మొత్తంలో డబ్బులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని బ్యాగ్ లలో ఉన్న 33 లక్షల పదివేల రూపాయలు స్వాదినం చేసుకోని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేయడం జరిగింది అని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్,(ఐజి) తెలిపారు.
*పట్టుబడిన వారి వివరాలు*
1) నిమ్మ ధనుంజయ్ s/o వెంకటరమణ ,21 yrs,రెడ్డిక కేశవరామునిపాలెం, లావేరు r/o శ్రీకాకుళం.
2) ముల్కల రాజ్ కుమార్ s/o వీరయ్య ,21 yrs ,యాదవ్ ,5 ఇంక్లైన్ ,గోదావరిఖని.
3) చిన్న పల్లి అభిలాష్ s/o రమేష్ ,21 yrs , పూసవేర్ల , జిఎం కలోని r/o గోదావరిఖని.
*నేర విధానం..*
పట్టుబడిన వారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయినా *55 క్లబ్ , తిరంగా యాప్, 82 లాటరీ యాప్* ల ద్వారా బెట్టింగ్ పెడుతూ, ఆ యాప్ లను సోషల్ మీడియా వేదికలైన ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ ల ద్వారా ఫాలోవర్స్ కి బెట్టింగ్ యాప్స్ లింక్స్ పంపుతూ వాడిని ఆడేలా ప్రోత్సహిస్తూ ఆ యాప్ ని అమాయక ప్రజలు ఆడేలా ప్రత్యక్షంగా వాటిని ప్రమోట్ చేస్తూ వాటి ద్వారా ఆ డబ్బులు సంపాదిస్తున్నారు. విరు అందులో భాగంగా బెట్టింగ్ యాప్ లో వీరి అకౌంట్ కు జమాయిన డబ్బును యూఎస్ డిటి USDT(యౌనటేడ్ స్టేట్ డిపార్త్మేంట్ అఫ్ ట్రేసరి) ద్వారా బెట్టింగ్ యాప్ నుండి హైదరాబాదులో ఉన్న 55 క్లబ్ , తిరంగా యాప్, 82 లాటరీ యాప్ ద్వారా వచ్చే డబ్బును మార్చి గుర్తు తెలియని మనీ ట్రేడర్స్ ద్వారా ఆ డబ్బుని తీసుకొని హైదరాబాదు నుండి గోదావరిఖనికి వస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు వారు పట్టుకొన్నారు. ఇట్టి కేసు కు సంబందించి ఇంకా ఎవరి ఎవరికి సంబంధం ఉన్నది అనే పూర్తీ విచారణ కొనసాగుతుంది.
