రాజకీయం

హలో మాదిగ చలో రవీంద్ర భారతి !

68 Views

హలో మాదిగ చలో రవీంద్ర భారతి
-హైదరాబాద్ జూలై 7న సభను జయప్రదం చేయండి

గజ్వేల్ ప్రతినిధి, జులై 2 (ప్రజా ప్రతిభ):

ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు జోగు మహేందర్ మాదిగ ఆధ్వర్యంలో దండోరా రజితోత్సవాల కరపత్రం తేదీ 02-07- 2024న దౌల్తాబాద్ మండల కేంద్రమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో , గువ్వలేగి గ్రామం డా. బీర్. అంబేడ్కర్ విగ్రహాము ప్రాంగణంలో విడుదల చేయటం జరిగింది. కరపత్రం విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లీ సాయిలు మాదిగ హాజరైనారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు ఈరోజు దౌల్తాబాద్ కేంద్రంలో హలో మాదిగ చలో హైదరాబాద్ కు ప్రతి గ్రామం నుండి స్వచ్ఛందంగా మాదిగ దండోరా సీనియర్ నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు, కవులు,రచయితలు, మేధావులు, కళాకారులు, ఉప కులాలు సింధు, డక్కలి, మాస్టి, మోచి, సంగం బేడ బుడగ జంగాల ప్రజలారా దండోరా 30 ఏళ్ల రజితోత్సవాలకు తరలి రావలసిందిగా ప్రతి ఇంట్లో ఉన్న మాదిగ బిడ్డ దండోరా జెండలు ఎత్తిపెట్టి ఇంటింటా సంబరాలు జరుపుకుంటూ , మన డిమాండ్ ను గుర్తు చేసుకోవాలి జులై 7న రవీంద్ర భారతి లో జరిగే మాదిగ మృత వీరులను వారి కుటుంబాలను ఘనంగా సన్మానించుకోవడo, సత్కరించుకోవడం జైలులో జీవితం అనుభవించిన వారి నాయకత్వాన్ని అభినందిస్తాం , మెమెంటో, శాలువాతో సత్కరిస్తాం రవీంద్ర భారతిలో జరిగే సదస్సుకు వెయ్యి మంది డప్పులతో ,డప్పు చప్పులతో దండోరా పాటలతో మాదిగ సాంస్కృతిక గీతాలను కళాకారులను కవులను వివిధ ప్రజా సంఘాలు గా రాజకీయ నాయకులుగా 30 సంవత్సరాలుగా సంఘానికి వెన్ను దన్నుగా నిలిచిన వారిచే ఉపన్యాసాలు ఉంటాయి, సాంస్కృతిక కళలను ఉప కులాల వారిచే సాంస్కృతిక కళలను ప్రదర్శించుకోవడం జరుగుతుంది. కావున ప్రతి గ్రామం నుండి హైదరాబాదులో జరుగు దండోరా సదస్సుకు తరలి రావాల్సిందిగా వేడుకుంటున్నాం . ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జంగాపల్లి సాయిలు మాదిగ, మండల అధ్యక్షులు జోగు మహేందర్ మాదిగ, సలహాదారు జోగు నర్సింలు మాదిగ, జోగు యాదగిరి మాదిగ, రాజు మాదిగ, పవన్ మాదిగ, నవీన్ మాదిగ, శ్రీను మాదిగ, చిన్న కృష్ణ తదితరులు పాల్గోన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్