ప్రాంతీయం

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

58 Views

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

. అన్నదానం మహా దానం – నంగునూరి సత్యనారాయణ

జూన్ 30 ,గజ్వేల్:

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద వాసవి సేవా సమితి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్,సీనియర్ నాయకుడు నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని ఆర్యవైశ్య నాయకులు కీర్తి శేషులు దూబకుంట నాగభూషణం వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రుక్మయ్య , లచ్చలు కుటుంబ సభ్యుల సౌజన్యంతో దాదాపు 300 మందికి అన్నదానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ,ఐ వి ఎఫ్ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్, దొంతుల సత్యనారాయణ, రుక్మయ్య, లచ్చలు, గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్