Breaking News

భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు

56 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకి ఆదివారం కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్చంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుండి ప్రతిభావంతులకు అందజేయగా మన తెలంగాణ ప్రాంతం నుండి భక్తి రంగం విశేష సేవలు అందించి ప్రతి రోజు లక్షల మందికి భక్తులచే గత 25 సంవత్సరాల నుండి 400కోట్ల లిఖిత రామ నామాలను పూర్తి చేయించి 1000కోట్లకు శ్రీకారం చుట్టడం అయన ఆధ్యాత్మి, కృషి, పట్టుదలను గ్రహించి భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని రామకోటి రామరాజకు అందజేయడం విశేషం. గత పాతిక ఏండ్ల నుండి యజ్ఞ, యాగాలు, సీతారాముల కళ్యాణలు, పలుమార్లు ఘనంగా నిర్వహించి, భక్తులకు భక్తి మార్గాన్ని చూపిస్తున్న రామకోటి రామరాజును భద్రాచలం దేవస్థానమే మరో భక్త రామదాసు కీర్తించి పలు సార్లు ఘనంగా సన్మానించారు. అన్ని దేవాలయాలు రామకోటి రామరాజు భక్తిని కీర్తించాయి. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంస్థకు ఇవ్వని గోటి తలంబ్రాల కార్యక్రమం రామకోటి సంస్థకు ఇవ్వడం తద్వారా లక్షల మంది భక్తులచే 150కిలోల గోటి తలంబ్రాలు ఓలిపించి తిరిగి సీతారాముల కల్యాణనికి అందించిన ఘనత రామకోటి సొంతం. అలాగే కళ్యాణ అనంతరం ముత్యాల తలంబ్రాలు ఏ సంస్థకు ఇవ్వని 100కిలోలు రామకోటి రామరాజుకు అందజేషి ఘనంగా సన్మానించిన ఘనత రామకోటి రామరాజుకే సొంతం.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka