*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు*
*ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోయిన శ్రీనివాస్*
చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ను సర్పంచ్ బోయిని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై తదుపరి వారు మాట్లాడుతూ..
ప్రజా ఆరోగ్య భద్రత విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో విశిష్ట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేద ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు మూత్రపిండ షుగర్ టెస్ట్ లు నిర్వహించి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు చాలా సంతోషం అని అన్నారు అదేవిధంగా వృద్ధులకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దుస్తులు అందజేయడం ద్వారా ఉచితంగా అందజేయడం. కొనియాడారు ఇలాంటి పేద ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తూ గ్రామాలలో ఉచితంగా వైద్యం అందించే వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని అన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో కూడా ఇలాంటి వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు తోడుగా నిలవాలని నిర్ణయించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిన శ్రీనివాస్ ఉప సర్పంచ్ కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి కార్యదర్శి రాధాకృష్ణా రెడ్డి డాక్టర్ ఎంఎల్‌ఎన్ రెడ్డి రిటైర్డ్ ఆర్డీవో ఈశ్వరయ్య వార్డు సభ్యులు గ్రామస్తులు నిర్వహించారు.





