నవంబర్ 13
మర్కుక్ మండలంలోని కాశిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు.గ్రామంలోని ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య, ఎం పీపీ పాండు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి , సీనియర్ నాయకులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
