ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని సిరిసిల్లలో ప్రారంభించిన గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు..
ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అని అన్నారు..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగించారు అని గుర్తుచేశరు .
నేడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు అభయ హస్తం ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు
ఈ కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం గ్యారెంటీలకు అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకుంటూ మరే ఇతర ప్రభుత్వ సహాయ సహకారాల కైనా తెల్ల పేపర్ పై దరఖాస్తులు రాసి ఈ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా అందించవచ్చని అన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందేలా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం అని అన్నారు…
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ సీఐ ఉపేందర్ గారు, సిరిసిల్ల మున్సిపల్ పట్టణ ప్రణాళిక అధికారి అన్సార్ గారు, మున్సిపల్, మెప్మా సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు…




