రాజకీయం

రెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం

58 Views

రెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం

. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకున్న మేడ్చల్
ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్
రెడ్డి

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26)

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి లోని తమ ఫామ్ హౌస్ లో రెండవ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పరచుకున్నారు. ముందుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరికల పట్ల మంగళవారం రోజున బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పరుచుకున్నారు. నిన్నటి రోజున వీలుకాని ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలు ఈరోజు కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ అధ్యక్షుడి మార్పు విషయం గురించి చర్చించినట్లు సమాచారం. సమావేశానికి హాజరు అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ నేతలకు గులాబీ అధినేత కేసిఆర్ పార్టీ వీడిన నేతల విషయం పట్ల అధైర్యం చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించి రాజకీయ వ్యూహాల గురించి దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. కెసిఆర్ గతంలో అసెంబ్లీ,లోక్ సభలో చేసిన తెలంగాణ ఉద్యమ పోరాటాల గురించి ఎమ్మెల్యేలతో మలినం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆర్మూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, తదితర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్