రాజకీయం

సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అరూరి

245 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9)

జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుడు సహచర జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి మృతి వ్యక్తిగతంగా తనను కలచివేసిందని పార్టీ కోసం వారు ఎంతో సేవ చేశారని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ పరంగా వారికి అండగా ఉంటామని తెలియజేశారు.

వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్,మండల రైతు బందు కో ఆర్డినేటర్ యాదగిరి,సర్పంచులు ఫోరం అధ్యక్షులు సారంగపాణి,ఎంపిటిసి శ్యామ్ కుమార్ రెడ్డి,సర్పంచ్ కృష్ణ రెడ్డి,జిల్లా రైతు బందు మెంబర్ జగన్,జిల్లా నాయకులు సుదర్శన్,రాజు, శ్రీనివాస్,మల్లయ్య తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *