(తిమ్మాపూర్ డిసెంబర్ 23)
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై
అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ కాంగ్రెస్పార్టి మండల అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…
ఈ సందర్భంగా మొరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ…
స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే బేశరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…
ఇప్పటికే మానకొండూర్ నియోజకవర్గం నుంచి రసమయిని ప్రజలు తరిమికొట్టారని, ఎమ్మెల్యే కవ్వంపల్లి పై పిచ్చి కూతలు కూస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఊరికిచ్చి తరిమికొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఎంపి ఎలక్షన్ వరకే మానకొండూర్ నియోజకవర్గంలో వుంటారాని, డబ్బులు దండుకొని పరారి అవుతావని అన్నారు..
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమలుచేసిందని, ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా మా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తారని అన్నారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….




