ప్రాంతీయం

సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

44 Views

సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర” మహోత్సవంలో దేవక్కపల్లి జాతర కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, జాతర కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ‘సమ్మక్క సారలమ్మకు’ ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలని పంట పొలాలు సుభిక్షంగా పండాలని వనదేవతలను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి క్రిష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *