మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెర్రబెళ్ళి రఘునాథ్ రావ్, జిల్లా ప్రధానకార్యదర్శి దుర్గం అశోక్ , ఆదేశాల మేరకు భీమారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ఆధ్వర్యంలో , జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించడం జరిగింది.
ఈకార్యక్రమంలో మండల ఇంచార్జీ ఆలం బాపు , మండలప్రధాన కార్యదర్శి మాడెం శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు దుషాంత్ యాదవ్, దుర్గం కత్తెరసాల, దుర్గం జెనార్థన్, వేల్పుల సతీష్ కార్యదర్శి ఆకుదారి శెంకర్ , మహిళ మోర్చ అధ్యక్షురాలు మేడి విజయ, బీసీ మోర్చ అద్యక్షులు అవిడపు సురేష్, సకినారపు మల్లేష్ గార్లు పాల్గొన్నారు.
