అంబేద్కర్ ఆభయ హస్తం పధకాన్ని అమలు చేయాలి
డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి
శంకర్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంబేద్కర్ ఆభయ హస్తం పధకాన్ని వెంటనె అమలు చెసి ఎన్నికల హమిని నిలబెట్డుకొవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. దళితుల సమగ్ర అభివృద్ది, రక్షణ ల పై అసెంబ్లీ లో చర్చించాలని డిమాండ్ చెస్తూ అదివారం రోజున సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం లో అంబేద్కర్ విగ్రహం వద్ద డిబిఎఫ్ అధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చెస్తామని ఎన్నికల మ్యానిపెస్టొలో హమి ఇచ్చారని గుర్తు చేశారు. గత బిఅర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పధకం స్ధానం లో అంబేద్కర్ ఆభయ హస్తం పధకాన్ని 12 లక్షలకు పెంచి అమలు చెస్తామన్నా హమి హమిగా నే మిగిలిపొయిందన్నారు.
అంబేద్కర్ ఆభయ హస్తం పధకానికి మార్గదర్శకాలను రూపొందించి వెంటనే అమలు చేయాలని శంకర్ డిమాండ్ చేశారు.ఎస్సీ రిజర్వేషన్ లను 18 శాతం పెంచుతామని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను విభజించి ఎస్సీ, ఎస్టీ ల ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చెస్తామనె హమి ని నిలబట్టుకొవాలని ఎస్సీ ఎస్టీ ల పై పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకొవాలని శంకర్ కోరారు. ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, ఇందుప్రియాల్ స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు.
