జూన్ 17, 24/7 తెలుగు న్యూస్:కొత్తగూడెం, భద్రాచలం జట్ల మధ్య అండర్ 18 క్రికెట్ మ్యాచ్ పోటీలను ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్…
కొత్తగూడెం పట్టణం రామవరం సాధన గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన కొత్తగూడెం, భద్రాచలం క్రికెట్ జట్ల మధ్య అండర్ 18 మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించిన మాజీ కౌన్సిలర్ మోరే భాస్కర్.. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని గెలుపు, ఓటమిని పాజిటివ్ గా తీసుకోవాలని, గెలిచిన టీం ఉప్పంగిపోవద్దని, ఓడినవారు నిరుత్సాహపడద్దని ఓటమిని జయించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పాటించాలన్నారు.. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మంచి పట్టుదలతో ఆడి మన ఊరికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.. నిరంజన్ మహేష్ తేజ్ దీప్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు