రామగుండం సిపిగా ఎల్ ఎస్ చౌహన్
రామగుండం కమిషనర్ గా ఎల్ ఎస్ చౌహాన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
గోదావరిఖని సబ్ డివిజన్ అధికారిగా 2001 నుంచి 2004 వరకు పనిచేసిన చౌహన్ ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ వివిధ హోదాల్లో పనిచేశారు.
ప్రస్తుతం జోగుళాంబ గద్వాల రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న చౌహన్ కు సీపీగా బాధ్యతలు అందించారు.
